24.2 C
Hyderabad
Saturday, January 3, 2026
HomePanchangamToday Panchangam in Telugu ఈరోజు తిథి పంచాంగం, మంచి గడియలు

Today Panchangam in Telugu ఈరోజు తిథి పంచాంగం, మంచి గడియలు

ఈరోజు తెలుగు పంచాంగం తిథి, వార, నక్షత్రం తో పాటూ ఇతర వివరములతో ఇక్కడ ఇవ్వబడినది.

🕉️ 2 జనవరి 2026 🕉️

శుక్రవారం గ్రహబలం పంచాంగం

శుక్రవారం గ్రహాధిపతి “శుక్రుడు”. శుక్రుని అధిష్టాన దైవం “శ్రీ మహాలక్ష్మి” మరియు “శ్రీ ఇంద్రాణి”.

శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం శుక్రాయ నమః ||
  2. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః ||
  3. ఓం ఇంద్రాణియై నమః ||

శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణు ఆలయాలను దర్శించండి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించండి.

శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం, వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు, మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం మానుకోండి.

గ్రహ బలం కొరకు, శుక్రవారం గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. శుక్రవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, స్త్రీలకు మంచి ఫలితాలు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతుంది.

అమృత కాలం:
12:15 PM – 01:40 PM

దుర్ముహూర్తం:
08:54 AM – 09:39 AM, 12:38 PM – 01:23 PM

వర్జ్యం:
03:33 AM – 04:59 AM

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్య మాసం, శుక్ల పక్షం,

తిథి:
చతుర్దశి – జనవరి 01 రాత్రి 10:22 – జనవరి 02 సాయంత్రం 06:53
పౌర్ణమి – జనవరి 02 సాయంత్రం 06:53 – జనవరి 03 మధ్యాహ్నం 03:32

చతుర్దశి మంచి పనులకు ప్రతికూలమైన రిక్త తిథి. చతుర్దశి రోజు ఎటువంటి ముఖ్యమైన పనులు, వ్యాపారాలు, ప్రయాణాలు చేయకూడదు. సాధారణ పని మాత్రమే చేయండి. మంత్రాలు, స్తోత్రాలు పఠించండి.

చతుర్దశి తిథి, శివాలయ సందర్శనకు, ప్రత్యేకించి సూర్యాస్తమయం తరువాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు, శివ మంత్రాలు, శివ స్తోత్రాలు, శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నక్షత్రం:
మృగశిర – జనవరి 01 రాత్రి 10:48 – జనవరి 02 రాత్రి 08:04
ఆర్ద్ర – జనవరి 02 రాత్రి 08:04 – జనవరి 03 సాయంత్రం 05:27

మృగశిర జన్మ నక్షత్రానికి అధిపతి “కుజుడు”. అధిష్టాన దేవత “సోమ”. ఈ నక్షత్రం మృదువైన మరియు సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది.

మృగశిర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం భౌమాయ నమః ||
  2. ఓం చంద్రమసే నమః ||

మృగశిర నక్షత్రం ఉన్నరోజు – భవన నిర్మాణం, స్నేహం చేయడం, ఇంద్రియ సుఖాలు, అలంకరణలు, లైంగిక కార్యకలాపాలు, కొత్త దుస్తులు ధరించడం, వివాహ ప్రయత్నాలు, గానం, నృత్యం, శుభ వేడుకలు, దీక్షను స్వీకరించడానికి, ఉత్సవాలు, వ్యవసాయ పనులు మరియు ప్రయాణాలకు మంచిది.

రేపటి పంచాంగం

తేదీJanuary 3, 2026
విక్రమ సంవత్సరం:2082శఖ సంవత్సరం:1947
ఆయనం:దక్షిణఋతువు:హేమంత
తెలుగు మాసంపుష్య మాసంపక్షంశుక్ల పక్షం (పూర్ణిమ)
సంవత్సరంశ్రీ విశ్వావసు  
సూర్యోదయం (Sunrise)6:32:00 AMసూర్యాస్తమయం (Sunset)05:41 PM
పంచాంగం
తిథి:పుష్య పూర్ణిమ (17:15)వారంశని
నక్షత్రం:ఆరుద్ర (17:58)యోగం:బ్రహ్మ
విశేషంపుష్య స్నానాలుకరణం:భద్ర
వర్జ్యం:రాత్రి 09:21 నుండి రాత్రి 10:50దుర్ముహూర్తం:ఉదయం 06:42 – 08:13 (సూర్యోదయం నుండి)
రాహు కాలం:09:35-10:58గుళిక కాలం:06:37 AM to 08:03 AM
యమ గండం:13:45-15:08బ్రహ్మ ము.05:03 AM to 05:51 AM
అభిజిత్ ముహూర్తం:11:49 AM to 12:35 PMఅమృత కాలం:ఉదయం 08:32 to ఉదయం 09:56

ఓ లుక్కేయండి

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

తాజా వార్తలు

Join WhatsApp Channel