Marina beach: మెరీనా బీచ్ ఎయిర్ షో లో తొక్కిసలాట.. ఐదుగురు మృతి, 100 మందికి పైగా ఆస్పత్రిపాలు

Photo of author

Eevela_Team

Share this Article

చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎయిర్ షో లో అపశ్రుతి చోటు చేసుకుంది. 92 వ భారత వైమానిక దినం సందర్భంగా భారత వైమానిక దళం మెరీనా బీచ్‎లో ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షోను చూసేందుకు లక్షలాదిగా సందర్శకులు వచ్చారు. అక్కడి రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు గాయపడగా వందమండికి పైగా గాయపడ్డారు.

మృతి చెందిన వారిని శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56) దినేష్, మణి (55) గా గుర్తించారు.

21 సంవత్సరాల తర్వాత నగరంలో జరిగిన ఈ ఎయిర్ షోకు, సెలవుడినం కావడంతో దాదాపు 13 లక్షల మంది ట్రైన్, బస్, ఇతర వాహనాల్లో వచ్చారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ఈవెంట్ కు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో పాటు పలువురు వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు షో ముగిశాక అక్కడి లోకల్ రైల్వే స్టేషన్ లో అప్పటికే కిక్కిరిసిన ట్రైన్ వచ్చింది.. ప్రయాణికుల్లో తొక్కిసలాట మొదలై పలువురు స్పృహ కోల్పోయారు..

Join WhatsApp Channel
Join WhatsApp Channel