ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులకు 2026 నూతన సంవత్సర కానుక అదిరిపోయింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు విడుదలైన ఈ పోస్టర్, ప్రభాస్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించింది. “వంగా మార్క్ మాస్ ఎంటర్టైనర్ లోడింగ్”, “డార్లింగ్ ఈజ్ బ్యాక్ ఇన్ బీస్ట్ మోడ్” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది ‘యానిమల్’ వైబ్స్ ఇస్తోందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు
వంగా మార్క్ వైల్డ్ సర్ప్రైజ్: ‘ఆజానుబాహుడు’గా ప్రభాస్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోలను ఎంత రా అండ్ రస్టిక్ (Raw and Rustic) గా చూపిస్తారో మనకు తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత వంగా నుంచి వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను సరికొత్తగా ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ షర్ట్ లేకుండా, వెనక్కి తిరిగి నిలబడి ఉన్నాడు. ఒళ్లంతా గాయాలు, భుజంపై బ్యాండేజ్‌లు, పొడవాటి జుట్టు మరియు గడ్డంతో ప్రభాస్ లుక్ అత్యంత ఉగ్రంగా ఉంది.
మరోవైపు, ఈ పోస్టర్‌లో హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రభాస్‌కు సిగరెట్ వెలిగిస్తూ కనిపించడం గమనార్హం. ఒక చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని, నోటిలో సిగరెట్‌తో ఉన్న ప్రభాస్ లుక్ చూస్తుంటే, వంగా మళ్ళీ ఒక ఇంటెన్సివ్ డార్క్ డ్రామాను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, సందీప్ వంగా “ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడిని చూడండి” (Indian Cinema… Witness your AJANUBAHUDU) అని పేర్కొనడం విశేషం.
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ (IPS Officer) పాత్రలో కనిపిస్తున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఫస్ట్ లుక్‌లో ఉన్న గాయాలు, రౌడీయిజం షేడ్స్ చూస్తుంటే, ఇందులో ఏదో పెద్ద కథే ఉందని తెలుస్తోంది. గతంలో విడుదలైన ‘సౌండ్ స్టోరీ’ టీజర్‌లో కూడా ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ అని, అయితే ఏదో కారణం చేత జైలుకు వెళ్లాల్సి వస్తుందని హింట్ ఇచ్చారు. జైలర్ పాత్రలో ఉన్న ప్రకాష్ రాజ్ మరియు ప్రభాస్ మధ్య డైలాగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తోంది. మొదట ఈ పాత్రకు దీపికా పదుకొణెను అనుకున్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకుంది. దీంతో ‘యానిమల్’ ఫేమ్ తృప్తికి ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. అలాగే, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
T-Series మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సుమారు 9 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను 2026 ద్వితీయార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించింది. “వంగా మార్క్ మాస్ ఎంటర్టైనర్ లోడింగ్”, “డార్లింగ్ ఈజ్ బ్యాక్ ఇన్ బీస్ట్ మోడ్” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది ‘యానిమల్’ వైబ్స్ ఇస్తోందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు

