Union Bank of India Recruitment | బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 606 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 23, 2024 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 606 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు …
విద్యార్హత:
SO ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఎదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి డిగ్రీ చదివి ఉండాలి. పోస్టులవారీ అర్హత వివరాలు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు.
వయోపరిమితి
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారి కనీస వయస్సు పోస్ట్ ప్రకారం 20/25/26/28/30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. పోస్ట్ ప్రకారం గరిష్ట వయస్సు 35/38/45 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. వయోపరిమితుల్లో సడలింపుల సమాచారం క్రింద ఇవ్వబడిన లింక్ లోని అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ. 175 కాగా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850గా నిర్ణయించారు.
ఎంపిక విధానం
ఈ పోస్ట్ లకు అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేయబడతారు.
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం unionbankofindia.co.in లోగానీ క్రింద తెలిపిన లింకులో గానీ 23rd February 2024 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 03rd February 2024
దరఖాస్తుకు చివరి తేదీ: 23rd February 2024