GAIL Jobs: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

GAIL Careers 2026: గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్ – GAIL) తాత్కాలిక, ...

GAIL Careers 2026: గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్ – GAIL) తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నిర్దేశించిన ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య: 03
  • పోస్టులు – ఖాళీలు:
    • ఫుల్ టైమ్ మెడికల్ ఆఫీసర్ (ఉసర్, మహారాష్ట్ర): 01 పోస్టు
    • షిఫ్ట్ డ్యూటీ ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్ (పటా, ఉత్తరప్రదేశ్): 02 పోస్టులు
  • విద్యార్హతలు: * ఉసర్ (మహారాష్ట్ర) పోస్టులకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనరల్ మెడిసిన్ లేదా సర్జరీలో ఏడాది ఇంటర్న్‌షిప్ అనుభవం ఉండాలి. దానికి తోడు ఇండస్ట్రియల్ హెల్త్‌లో డిప్లొమా/ తత్సమాన కోర్సు చేసి ఉండాలి లేదా సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
    • పటా (ఉత్తరప్రదేశ్) పోస్టులకు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ రిజిస్ట్రేషన్ మరియు ఏఎఫ్ఐహెచ్ (AFIH – Associate Fellow of Industrial Health) సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి.
  • వయోపరిమితి: పటా (ఉత్తరప్రదేశ్) ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 56 ఏళ్లు మించకూడదు.
  • వేతనం: నెలకు రూ.1,04,000 చెల్లిస్తారు. దీనితో పాటు నిబంధనల ప్రకారం వార్షిక ఇంక్రిమెంట్, ఓపీడీ ఖర్చులు, ఇన్సూరెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    • ఉసర్ పోస్టులకు చిరునామా: General Manager (HR), GAIL (India) Limited, Petrochemical Complex, At Usar, Post-Malyan, Tal.-Alibag, Distt.-Raigad, Maharashtra, Pin Code 402203 కు పోస్టు ద్వారా పంపాలి. ఎన్వలప్‌పై “APPLICATION FOR THE POST OF MEDICAL OFFICER” అని రాయాలి.
    • పటా పోస్టులకు చిరునామా: Chief Manager (HR), New Polymer Bhawan, GAIL (India) Limited, Pata, Dist. – Auraiya, Uttar Pradesh, PIN 206241 కు పోస్టు ద్వారా లేదా recruitment.pata@gail.co.in కు ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు.
  • ముఖ్యమైన తేదీలు:
    • ఉసర్ పోస్టులకు: నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తులు చేరాలి.
    • పటా పోస్టులకు దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 07, 2026 సాయంత్రం 17:45 గంటల వరకు.

వివరాలకు

ఇక్కడ క్లిక్ చేయండి

Join WhatsApp Channel