IRCTC Tourism: హైదరాబాద్ నుంచి ‘డివైన్ కర్ణాటక’ టూర్ ప్యాకేజీ..

Photo of author

Eevela_Team

Share this Article

తెలుగు ప్రజలు కర్ణాటకలోని పర్యాటక, ఆద్యాత్మిక ప్రదేశాలు చుట్టివచ్చేలా ‘డివైన్ కర్ణాటక’ పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్ సిటిసి. హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ఈ టూర్ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది.దాదాపు రూ.15000 నుండి మొదలయ్యే ఈ టూర్ వివరాల్లోకి వెళ్తే ..

మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్లైట్ (6E 7549)లో జర్నీ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి హోటల్‌కు వెళ్తారు.

బ్రేక్ ఫాస్ట్ అనంతరం మంగళదేవి, కద్రి మంజునాథ దేవాలయాలకు వెళతారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ దేవాలయం సందర్శిస్తారు. రాత్రి మంగుళూరులోనే స్టే ఉంటుంది. 

రెండో రోజు ఉడిపి ట్రిప్ ఉంటుంది. మంగుళూరు నుండి ఉడిపికి చేరుకుని హోటల్ కు వెళ్ళి ప్రెషప్ అవుతారు. మధ్యాహ్నం సెయింట్ మేరీ ఐలాండ్, మల్ఫే బీచ్… సాయంత్రం శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి రాత్రి ఉడిపిలోనే స్టే చేస్తారు. 

మూడవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోరనాడుకు వెళతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి టెంపుల్‌ను దర్శించి, శృంగేరికి వెళతారు. శృంగేరి శారదాంబ టెంపుల్‌ను చూసిన తర్వాత ఉడిపికి తిరిగి వస్తారు. రాత్రి ఇక్కడే స్టే ఉంటుంది. 

నాలుగోరోజు ఉదయమే గోకర్ణ బయలుదేరతారు. అక్కడ టెంపుల్, బీచ్ ను చూసి మురుడేశ్వర్ కి బయలుదేరతారు. అక్కడ దర్శనం తర్వాత తిరిగి ఉడిపికి చేరుకుంటారు. నాలుగో రోజు రాత్రి కూడా ఉడుపిలోనే స్టే ఉంటుంది. 

ఐదవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ధర్మస్థలకు వెళ్లి మంజునాథ టెంపుల్‌ను దర్శించుకుంటారు. అక్కడ స్వామిని దర్శించుకున్నాక కుక్కే సుబ్రమణ్యకు వెళతారు. రాత్రి బస అక్కడే ఉంటుంది. 

ఆరోరోజు సుబ్రహ్మణ్యస్వామి దర్శనం అనంతరం తిరిగి మంగుళూరుకు బయలుదేరతారు. మద్యాహ్నం మంగుళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుండి విమానంలో రాత్రి 7 గంటలవరకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో హైదరాబాద్ టు కర్ణాటక ట్రిప్ ముగుస్తుంది. 

ఇకపోతే ఈ ప్యాకేజీ టారిఫ్ వివరాలు ఇలా ఉన్నాయి:

Package Tariff Per Person: (1 to 3 Passengers)

CategorySingle SharingTwin SharingTriple SharingChild With Bed
(5-11 yrs)
Child Without
Bed (5-11 yrs)
Comfort (3A)₹ 38100/-₹ 22450/-₹ 18150/-₹ 11430/-₹ 9890/-
Standard (SL)₹ 35070/-₹ 19430/-₹ 15130/-₹ 8410/-₹ 6860/-

Package Tariff Per Person: (4 to 6 Passengers)

CategoryTwin SharingTriple SharingChild With Bed
(5-11 yrs)
Child Without
Bed (5-11 yrs)
Comfort (3A)₹ 19190/-₹ 17110/-₹ 11430/-₹ 9890/-
Standard (SL)₹ 16170/-₹ 14090/-₹ 8410/-₹ 6860/-
Join WhatsApp Channel
Join WhatsApp Channel