Big Breaking: ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ

ఈ రోజు, సెప్టెంబర్ 21, 2025, సాయంత్రం 5 గంటలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం, దేవీ నవరాత్రుల, కొత్త జీఎస్టీ రేట్ల అమలుకు ముందు జరుగుతున్నది కనుక ఆయన ప్రసంగం అలాగే సాగుతుందని భావిస్తున్నా, అమెరికా సుంకాలు, నిబంధనలు, ఒత్తిడులు వంటి అంశాలు ప్రధాని ప్రసంగంలో ఉంటాయా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రధానమంత్రి మోడీ, నిన్న గుజరాత్‌లో జరిగిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో, తన ప్రసంగంలో దేశ ఆత్మనిర్భరత అంశాన్ని ప్రస్తావించారు. పారదర్శకత, స్వదేశీ ఉత్పత్తులు, మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను పునరుద్ఘాటించారు.

అందుకే ఈరోజు ప్రధాని ప్రసంగంలో ప్రసంగంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన H-1B వీసా ఫీజుల పెంపు మరియు భారత్-పాకిస్థాన్ సీఫైర్ ఒప్పందంపై కూడా చర్చించవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రధాని ప్రసంగం, ప్రధానమంత్రి కార్యాలయ అధికారిక యూట్యూబ్ ఛానెల్, Doordarshan, మరియు ఇతర టెలివిజన్ న్యూస్ ఛానెల్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దేశంలోని అన్ని టివి చానల్స్ కూడా ప్రసారం చేసే అవకాశం ఉంది.

Join WhatsApp Channel