Life of Sri Krishna: శ్రీకృష్ణుని జీవితం మానవాళికి ఆదర్శం.. కష్టాలను జయించిన పరమాత్ముడు..

Photo of author

Eevela_Team

Share this Article

శ్రీకృష్ణుని జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనిని… ఎవరికీ అంకితమవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. శ్రీకృష్ణుని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణగా నిలిచి పోతుంది.

శ్రీకృష్ణుని జీవన చక్రం

శ్రీకృష్ణుడు ఇప్పటికి 5 వేల 255 సంవత్సరాల క్రితం జన్మించాడు. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు.నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు.

పుట్టిన తేది: క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)

మాసం: శ్రావణం
తిథి: అష్టమి
నక్షత్రం: రోహిణి
వారం: బుధవారం
సమయం: రాత్రి గం.00.00 ( అంటే సరిగ్గా రాత్రి 12 గంటలు)
జన్మనిచ్చిన తండ్రి: వసుదేవుడు
జన్మనిచ్చిన తల్లి:.దేవకీ
పెంచిన తండ్రి: నందుడు
పెంచిన తల్లి: యశోద
సోదరుడు: బలరాముడు
సోదరి: .సుభద్ర
జన్మ స్థలం: మధుర
భార్యలు: రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ.
జీవిత కాలం: 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
నిర్యాణం: క్రీ పూ 18.02.3102 (3102 B.C)
శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది.
కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం.
కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది..

శ్రీకృష్ణుని బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 14 నుంచి 16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14నుంచి 16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం కొరకు 16 నుంచి 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను.

పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను. గాంధారీ శాపం వలన అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించాడరి స్కంధ పురాణం ద్వారా తెలుస్తోంది

Join WhatsApp Channel
Join WhatsApp Channel