Bigg Boss Telugu 8 Contestants List: కంటెస్టెంట్స్ వీళ్ళే .. మొత్తం 14 మంది

Photo of author

Eevela_Team

Share this Article

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకొన్ని రోజుల్లో మొదలు కాబోతుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం నుండి బుల్లితెరపై వీక్షకులను అలరించబోతోంది. అయితే కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పటిదాకా ఎన్నో లీకుల మీద లీకులు ఇస్తూ వస్తోంది బిగ్ బాస్ టీం. దీనితో యూట్యూబ్ చానల్స్ ద్వారా విశ్లేషించే కొందరు తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దాదాపు షోలోకి వస్తారు అనుకున్న కొందరిని తొలగించి వారిస్థానంలో మారికొందరిని తీసుకోవడం.. ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారనుకున్న కొందరు అగ్రిమెంట్లమీద ఇంకా సైన్ చేయకపోవడంతో లిస్ట్ లో మార్పులు వస్తూనే ఉన్నాయి.

చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ వర్మ, జబర్దస్త్ రీతూ చౌదరి ఇప్పటివరకు బిగ్ బాస్‌కు వెళ్లేందుకు సైన్ చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి ఒక 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు కూడా బయటికి వచ్చేశాయి.

వెళ్లబోయేది వీళ్ళే ..

ఆదివారం నాడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఆ 14 మంది లిస్ట్ మొత్తానికి బయటకు వచ్చేసింది. దాదాపు వీళ్ళే సీజన్ 8 కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు.

వీరు ఎవరు అంటే ..

ఇటీవల ఒక వివాదంలో స్నేహితుడి కోసం పోరాడిన ఆర్జే శేఖర్ బాషా, ప్రముఖ తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్లలో నైనిక, తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన హీరోయిన్ విస్మయ శ్రీ, హీరో అభిరామ్ వర్మ ఉన్నారు.

అలాగే యూట్యూబ్‌లో బూతు వీడియోలు చేసి.. ఆతర్వాత ‘బేబీ’ సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టే పాత్రను చేసి మరింత హైలైట్అయిన కిర్రాక్ సీత కూడా హౌస్లో కి ఎంట్రీ ఇవ్వబోతోంది.

వీళ్ళతో పాటూ న్యూస్ రీడర్ కల్యాణి, సహర్ కృష్ణన్, అభయ్ నవీన్, అంజలి పవన్, ఆదిత్య ఓం, నిఖిల్ మలియక్కల్, యాంకర్ విష్ణుప్రియ, యష్మీ గౌడ, నాగమణికంఠ, యూట్యూబర్ బెజవాడ బేబక్క కూడా సీజన్ 8 లో వీక్షకులను అలరించి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel