23.2 C
Hyderabad
Monday, December 29, 2025
HomeAndhra PradeshSIT: లడ్డూ కల్తీ ఘటనపై సిట్‌ దర్యాప్తు నిలిపివేత: డీజీపీ

SIT: లడ్డూ కల్తీ ఘటనపై సిట్‌ దర్యాప్తు నిలిపివేత: డీజీపీ

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి అంశంపై సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, ఈ నెల 3వ తేదీన తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మాసనం.. విచారణను 3వ తేదీ వరకు వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా..? లేదా..? అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించడమే కాకుండా సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది.

ఓ లుక్కేయండి

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

తాజా వార్తలు

Join WhatsApp Channel