Andhra PradeshPolitics

Kethireddy: కేతిరెడ్డి వ్యాఖ్యలు పార్టీ ధిక్కారమా… జగన్ పై తిరగబడ్డారా… నిజం ఏంటి (విశ్లేషణ)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజేకీయాల్లో వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది ప్రత్యేక స్థానం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతీరోజూ ఉదయాన్నే ప్రజలను కలిసి .. వారి కష్ట సుఖాలు తెలుసుకునేవారు.. జగన్ ప్రవేశపెట్టిన “గడప గడపకూ వైసీపీ” కార్యక్రమం కన్నా ముందే ఈయన “గుడ్ మార్నింగ్ ధర్మవరం” ప్రారంభించారు. ఆయనకు ఎదురే లేదు .. తప్పక గెలుస్తారు అనుకున్నప్పటికీ అనూహ్యంగా నియోజకవర్గంలో పెద్దగా పేరు తెలియని .. అందునా బిజెపి అభ్యర్ధి చేతిలో ఓటమి పాలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. ఈ ఓటమి తర్వాత ఒకవిధంగా ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు..

ఆ తర్వాత కోలుకుని కొద్ది కొద్దిగా తన ఓటమికి గల కారణాలను విశ్లేషించడం ప్రారంభించారు. ముందుగా .. ఈవీయం లలోని ఓట్ల తేడాను చెపుతూ వాటిలోని లోపాలను బయట పెట్టారు.. అటు తర్వాత విజయమ్మ .. షర్మిళ లు జగన్ ఓటమికి కారణం అన్నారు.. తర్వాత సీయం కార్యాలయంలోని కొందరు పెద్ద తలకాయలు అన్నారు.. ఆ తర్వాత జగన్ వైఖరి గురించి .. పాలనా లోపాలను ఎట్టి చూపుతూ వీడియోలు చేస్తున్నారు .. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తన యూట్యూబ్ చానల్ లో క్రొత్తగా ఒక వీడియో పెట్టారు. దానిలో హామీల అమల్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని అన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే హామీల అమలుపై గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. చంద్రబాబు చెప్పినట్లు సంపద సృష్టించడానికి కనీసం ఒక ఆర్ధిక సంవత్సరం సమయం ఇవ్వాలని .. ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు.

ketireddi-venkataramireddy
Kethireddy Venkatarami Reddy

అంతే కాదు… ప్రభుత్వం అనేది పాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదు. ఇసుక, మద్యం వ్యాపారాలు ప్రభుత్వం కాకుండా థర్డ్ పార్టీ చేయాలి. ఈ రెండూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పెద్ద తప్పులు. వీటి వల్లనే చెడ్డపేరు మూటగట్టుకున్నామనే అపవాదు ఉంది. అయితే ఆరోజు మేము చేసిన తప్పులే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తోంది… అని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినప్పటికి, ప్రజలు డాన్ని పట్టించుకోలేదన్నారు.. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ ని దూరం చేసుకున్నామని అన్నారు. సినిమా టికెట్‌ రేట్ల జోలికి తాము పోకుండా ఉండాల్సిందన్నారు.

ఇక చెత్తపై పన్ను వేయడాన్ని ఆయన సమర్ధించారు.. ఈ అంశాన్ని చెపుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో చెత్త పన్ను వసూలు చేస్తే టీడీపీ రాజకీయం చేసిందని .. జగన్ ను చెత్త ముఖ్యమంత్రి అంటూ విమర్శించిందని .. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో చెత్తపై పన్ను విధిస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందని.. చెత్తను తరలించేందుకు ప్రజల నుంచి పైసలు వసూలు చేయడం తప్పు కాదు అని .. తమంతట తాము చెత్తను పట్టుకెళ్ళి పడేయలేరు కదా .. అని చెప్పుకొచ్చారు.

ఇక జగన్ కోసం చెపుతూ .. తన సభల్లో జగన్ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని పదే పదే ప్రచారం చేయటంతో మిగతా వర్గాలు వైసీపీకి దూరమయ్యాయని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం ప్రజల సంక్షేమం చూస్తూ అనేక పథకాలను అమలు చేసినప్పటికీ వైసీపీకి 11 సీట్లే వచ్చాయని .. నిత్యం ప్రజల్లో ఉన్న తనకు నిందలు .. ఓటమి మాత్రమే మిగిలాయని .. ఎన్నికల కొద్ది రోజులు ముందు వచ్చిన వారు అందలం ఎక్కారు అని వాపోయారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అల్లర్లపై కేతిరెడ్డి స్పందిస్తూ … మనం వేసిన బంతి తిరిగి మనకే వచ్చి తగులుతోందని అన్నారు. అప్పట్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వారు ఇప్పుడు కనిపించడం లేదన్నారు.

నిజానికి కేతిరెడ్డి వీడియో చూస్తే ఆయన ఎక్కడ జగన్ పై తప్పుగా మాట్లాడినట్లు కనపడలేదు అయితే టిదపి మీడియా ఆయన వ్యాఖ్యలను చంద్రబాబుకి అనుకూల వ్యాఖ్యలుగా మార్చేసింది.. జగన్ పై తిరుగుబాటు .. జగన్‌పై తిరగబడ్డ కేతిరెడ్డి.. జగన్‌కి కేతిరెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి మరీ వీడియోని వదిలారు. సాక్షి అదే వీడియోని “జగన్ కు అందరం అండగా ఉండాల్సిన సమయం” అంటూ తనకు అనుకూలంగా మార్చుకుంది.

మరి ఆయన వీడియోపై వైసీపీ .. జగన్ స్పందన ఎలా ఉందో కాలమే నిర్ణయిస్తుంది.