భారీ వరదలతో దెబ్బతిన్న విజయవాడ చుట్టుప్రక్కల వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను హెలీకాప్టర్ నుంచి పరిశీలించారు. అదే సమయంలో ఆయన ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని కూడా పరిశీలించారు.
అంతేకాదు, బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో కూడా చంద్రబాబు పరిశీలించారు.