Skip to content
eevela
  • Eevela
  • Devotional
  • Education
  • Life Style
  • Panchangam
  • Science & Technology
  • Sports
  • Technology
eevela
  • Eevela
  • Devotional
  • Education
  • Life Style
  • Panchangam
  • Science & Technology
  • Sports
  • Technology
Home » Andhra Pradesh » మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఆర్డినెన్స్ జారీ చేయనున్న గవర్నర్ ..
chandrababu-pavan
Andhra PradeshBusiness

మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఆర్డినెన్స్ జారీ చేయనున్న గవర్నర్ ..

July 31, 2024 Eevela_Team

దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తి బడ్జెట్ లేకుండా రెండోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ఈరోజుతో ముగుస్తుండడంతో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అమలుచేయడానికి చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది.

chandrababu-pavan
chandrababu-pavan

ఇంతవరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై స్పష్టత లేకపోవడం, ఇచ్చిన హామీలకు నిధులు ఎలా సమీకరించాలో అర్ధం కాకపోవడంతో వచ్చే నాలుగు నెలల కాలానికి మరోసారి సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ను రూపొందించింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్ లు, గ్రాంట్ లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదించి గవర్నర్ కు పంపింది.

కాగా.. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగిసిన అనంతరం.. సెప్టెంబర్ లేదా ఆక్టోబర్‌ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ పై నిర్ణయం తీసుకోనున్నారు.

సాధారణంగా ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలాగా బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే ఎన్నికల కారణంతో గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నాలుగు నెలల కాలానికి ప్రవేశ పెట్టవలసి వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అదే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించింది.

అయితే మరోసారి కొత్తగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి అద్దం పడుతోంది. మొన్ననే చంద్రబాబు శాసన సభలో “సూపర్ సిక్స్ అంటే భయమేస్తుంది” అని అనడంతో నిధుల సమీకరణపై ఇంకా స్పష్టత లేని విషయాన్ని బయటపెట్టింది.

  • INDvsSL 3rd T20I: క్లీన్ స్వీప్ .. సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ విజయం..
  • Today Panchangam: 01 ఆగస్టు 2024 తిథి, నక్షత్రం, రాహుకాలం
Share This Post:

You May Also Like

covid case in vizag

Covid-19: విశాఖలో వివాహితకు కోవిడ్ పాజిటివ్

May 22, 2025 Eevela_Team
ap job mela

AP Job Mela 2025: గుంతకల్లు లో రేపే జాబ్ మేళా… 400 పోస్టులు, ఇంటర్/డిగ్రీ అర్హత చాలు!

August 4, 2025 Eevela_Team
toll-charges-increase-AP

AP Toll Hike: ఏపిలో టోల్​ చార్జీల మోత షురూ..

December 19, 2024 Eevela_Team

Also Read

Asia Cup : పాక్ పై పది గోల్స్ చేసి చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు

hcl-apprentice

HCL Malanjkhand Apprentice: 195 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

Vadapalli Venkateswara Swamy: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర, వేళలు, సేవలు

Vadapalli Venkateswara Swamy: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర, వేళలు, సేవలు

bigg-boss-telugu-8

Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం

Copyright © 2025 Eevela. All rights reserved.

Join WhatsApp Channel