18.2 C
Hyderabad
Monday, December 29, 2025
HomeAndhra PradeshAP Schools Reopen Day: విద్యార్థులకు గుడ్ న్యూస్... స్కూళ్ల ప్రారంభం రోజే..

AP Schools Reopen Day: విద్యార్థులకు గుడ్ న్యూస్… స్కూళ్ల ప్రారంభం రోజే..

 

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 10,
15 రోజుల్లో వెసవి సెలవులు ముగియనున్నాయి. పాఠశాలలు పునః ప్రారంభం
కానున్నాయి. ఇక ఇప్పటికే స్కూళ్లల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా
ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ
శుభవార్త చెప్పింది.

 ప్రభుత్వ స్కూళ్లల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదివే
విద్యార్థులకు,, షూలు, రెండు జతల సాక్సులు అందిస్తామని పాఠశాల విద్యాశాఖ
తెలిపింది. పాఠశాలలు ప్రారంభమయ్యే 12వ తేదీ రోజే వారికి ఇవి అందజేస్తామని
ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. షూలు
16 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల పాదాల పరిమాణానికి అనుగుణంగా ఉండాలని
తయారీదారులకు సూచించారు. నాణ్యత, సరఫరాలో లోపం లేకుండా చూడాలని స్పష్టం
చేశారు.

మరోవైపు జగనన్న విద్యాకానుక పథకం కింద గవర్నమెంట్ బడుల్లోని
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు
ఇతరత్రా సామాగ్రితో కూడిన కిట్‌ను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే
ఈ ఏడాది కూడా విద్యా కానుక కిట్లను స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి
అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో 2024–25
విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా కానుక కిట్లు ముందుగానే సిద్ధం చేశారు.
మండలాల్లోని స్టాక్‌ పాయింట్లకు జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా కూడా
జరుగుతోంది. జూన్ మొదటి వారానికి ఈ సామగ్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
రానుంది. అటు పాఠ్య పుస్తకాలు, బెల్టులు ఇప్పటికే స్టాక్ పాయింట్లకు
చేరగా.. షూలు, సాక్సులు కూడా జూన్ 12 నాటికి అందిస్తామని ప్రవీణ్ ప్రకాష్
తెలిపారు.

ఓ లుక్కేయండి

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

తాజా వార్తలు

Join WhatsApp Channel