ఉమ్మడి మేనిఫెస్టో అమలుకి శ్రీకారం .. ఖజానా నిల్వలను బట్టి నిర్ణయం

 

ఉమ్మడి మేనిఫెస్టో అమలుకి శ్రీకారం .. ఖజానా నిల్వలను బట్టి నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో ఘన విజయం తర్వాత టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం జనవరి 9న ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు. 

ఐతే.. అదే సమయంలో ఆయన ముందుగా.. మెగా డీఎస్సీపై సంతకం పెడతానని ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. తొలి సంతకం అదే అన్నారు. అదేరోజు ఆయన మెగా డీఎస్సీ కోసం ప్రకటన చేసెయ్యొచ్చు. 

అలాగే చంద్రబాబు.. ఇదివరకు సూపర్ సిక్స్ పేరుతో 6 గ్యారెంటీ హామీలను ప్రకటించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజునే 6 పథకాలనూ ఒకేసారి అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ టీడీపీలో జరుగుతోందని తెలిసింది. అయితే, ఇదేమంత తేలిక కాదు కాబట్టి.. తెలంగాణ తరహాలోనే.. తొలి రోజు ఉచిత బస్సు హామీని కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా సాగుతోంది. 

ప్రమాణ స్వీకారానికి ఇంకా 3 రోజులే టైమ్ ఉంది. ఇవాళ ఢిల్లీలో ఉంటారు కాబట్టి.. 6 నుంచి 8లోపు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే.. ఖజానాలో ఎంత డబ్బుందో చూసి.. దాన్ని బట్టీ మిగతా పథకాలు అమలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

కూటమి హామీలను పరిశీలిస్తే..

 1. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి. 

2. స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000. 

3. ప్రతి రైతుకూ ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం. 

4. ప్రతి మహిళకీ నెలకు రూ.1,500 (19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు). 

5. ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. 

6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 

ఈ 6 హామీల్లో ఉచితబస్సు, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెన్షన్ కూడా జులై నుంచి అమలయ్యే అవకాశం ఉంది. పెన్షన్ జులై నుంచి అమలు చేస్తామని ఇదివరకు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబే అన్నారు.

ఇచ్చిన హామీలు నరవేర్చరు అని జగన్ తనపై వేసిన ముద్రను చెరిపేసుకోవడం తద్వారా ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అని, భవిష్యత్ లో తాను చేపట్టబోయే వివిధ కార్యక్రమాలకు వారి నుండి మద్దతు వస్తుందని చంద్రబాబు బావిస్తుండవచ్చు. 

Join WhatsApp Channel