TOSS Results 2026: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు.. ఏ వెబ్‌సైట్‌లో, ఎలా చెక్ చేసుకోవాలంటే?

హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల (TOSS Results 2026) కోసం విద్యార్థుల నిరీక్షణ ముగియనుంది. ఏప్రిల్/మే నెలల సెషన్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు సిద్ధం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫలితాలను మే 30న అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

TOSS టెన్త్ మరియు ఇంటర్ థియరీ పరీక్షలు 2026 ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరిగాయి. ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహించారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం (35%) మార్కులు తెచ్చుకోవడం తప్పనిసరి. థియరీ మరియు ప్రాక్టికల్స్‌లో వచ్చిన ఉమ్మడి మార్కుల ఆధారంగా పాయింట్లు మరియు గ్రేడ్‌లను కేటాయిస్తారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలు విడుదలైన వెంటనే ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా మీ రిజల్ట్స్ తెలుసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. ముందుగా తెలంగాణ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.org ని గానీ, లేదా ఎడ్యుకేషన్ పోర్టల్ eenadupratibha.net ని గానీ సందర్శించండి.
  2. హోమ్‌పేజీలో కనిపించే ‘TOSS SSC Results 2026’ లేదా ‘TOSS Inter Results 2026’ లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. అక్కడ మీ హాల్ టికెట్ నంబర్ (Roll Number) లేదా అడ్మిషన్ నంబర్‌ను నమోదు చేసి ‘Submit’ బటన్ నొక్కాలి.
  4. వెంటనే మీ సబ్జెక్ట్ వారీ మార్కుల మెమో (Scorecard) స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  5. భవిష్యత్ అవసరాల కోసం ఆ మార్కుల జాబితాను పీడీఎఫ్ (PDF) ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి
Join WhatsApp Channel