18.7 C
Hyderabad
Wednesday, February 4, 2026
HomeMoviesDhurandhar 2: 'ధురంధర్ 2' టీజర్ ఆకట్టుకోలేదా... వీక్షకులు ఏమంటున్నారు?

Dhurandhar 2: ‘ధురంధర్ 2’ టీజర్ ఆకట్టుకోలేదా… వీక్షకులు ఏమంటున్నారు?

ముంబై: వెండితెరపై మరోసారి భారీ యాక్షన్ ధమాకాకు రంగం సిద్ధమైంది. అగ్ర నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) కు సంబంధించిన కీలక అప్‌డేట్లను చిత్ర బృందం వెల్లడించింది. ఈ రోజు (ఫిబ్రవరి 3) చిత్ర యూనిట్ అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో రణవీర్ సింగ్ ‘జస్క్రీత్ సింగ్ రంగీ’ (హమ్జా) పాత్రలో మరింత పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. “ఇది కొత్త భారతం.. సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి మరీ దెబ్బకొడుతుంది” అనే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశభక్తి మరియు రివెంజ్ డ్రామా కలబోతగా ఈ సీక్వెల్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

టీజర్ ఆకట్టుకోలేదా? వీక్షకుల పెదవి విరుపు!

టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అత్యధిక శాతం వీక్షకులు టీజర్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొదటి భాగం (Dhurandhar) చివరలో చూపించిన పోస్ట్-క్రెడిట్ సీన్స్‌నే మళ్ళీ ఎడిట్ చేసి టీజర్‌గా వదిలారని నెటిజన్లు మండిపడుతున్నారు. “కొత్తగా ఒక్క షాట్ కూడా లేదు.. మేకర్స్ మమ్మల్ని మోసం చేశారు” అంటూ ఎక్స్‌ (X) వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ టీజర్‌లో కొత్తదనం లేకపోవడం సినిమా హైప్‌ను కొంత తగ్గించేలా ఉందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. అయితే, మరికొందరు మాత్రం కథలో కీలక మలుపులు లీక్ కాకుండా ఉండేందుకే చిత్ర బృందం ఇలా జాగ్రత్త పడి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అర్జున్ రాంపాల్ ‘మేజర్ ఇక్బాల్’ అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలవగా, పార్ట్-2ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారీగా విడుదల చేస్తున్నారు.

కథా నేపథ్యం

తొలి భాగం కరాచీ అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగగా, ఈ రెండో భాగంలో హీరో బ్యాక్ స్టోరీ మరియు అతను తీర్చుకోబోయే పగ చుట్టూ కథ తిరగనుంది. సరిహద్దుల్లో జరిగే ఉత్కంఠభరిత పోరాట సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బాక్సాఫీస్ పోరు

మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాలతో పోటీ పడనుంది. యశ్ నటించిన ‘టాక్సిక్’, అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రాలు కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనేలా కనిపిస్తోంది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel