దాయాది పాకిస్తాన్ కు భారత్ శక్తి మరోసారి తెలిసి వచ్చింది. భారత్ ఉగ్రవాదులపై చేసిన “ఆపరేషన్ సిందూర్” కి ప్రతిగా డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనదేశం ఒకవైపు సమర్ధవంతంగా తిప్పికొడుతూనే.. ఆదేశ ఆర్ధిక, భౌగోళిక మూలాలపై దాడులు చేస్తూండడంతో.. ఇప్పటికే చితికిపోయిన ఆర్ధిక వ్యవస్థ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతలతో భారత్ ను అనవసరంగా కెలికాం అన్న అభిప్రాయం పాక్ ప్రభుత్వ పెద్దలలో ఏర్పడింది.
దీనికి ఋజువుగా ఈరోజు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ వ్యాఖ్యలను చూడవచ్చు. భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపితే తాము కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఈరోజు ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ యుద్ధ వాతావరణాన్ని రూపుమాపడం కోసం న్యూదిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
నిజానికి యుద్ధ వాతావరణాన్ని సృష్టించిందే పాకిస్తాన్! తోడుగా వస్తాయి అనుకున్న దేశాలు దూరం కావడం.. అమెరికా తీవ్ర హెచ్చరికలతో ఇక పాకిస్తాన్ పూర్తిగా వెనక్కి తగ్గినట్లే భావించాలి.
మరో కీలక పరిణామం
న్యూక్లియర్ బాంబ్‌ను పర్యవేక్షించే అథారిటీతో ఈరోజు ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని సమావేశం అర్ధాంతరంగా రద్దయింది. దీనికి కారణం అమెరికా హెచ్చరిక అనే భావిస్తున్నారు.