22.7 C
Hyderabad
Thursday, January 8, 2026
HomeWorldఅమెరికా చెప్పినట్లు వింటాం: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ సంచలన ప్రకటన

అమెరికా చెప్పినట్లు వింటాం: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ సంచలన ప్రకటన

వెనిజులా రాజకీయ సంక్షోభంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. నికోలస్ మదురో అరెస్టు అనంతరం ఆ దేశ తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగెజ్ అమెరికాతో సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలతో కూడిన కథనం ఇక్కడ ఉంది.కరాకాస్/వాషింగ్టన్: దశాబ్దాల కాలంగా అమెరికాను బద్ధశత్రువుగా చూసిన వెనిజులా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న 48 గంటల వ్యవధిలోనే, ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగెజ్ (Delcy Rodríguez) అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయేలా ఒక ప్రకటన చేశారు. “దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము అమెరికా సూచనలను పాటిస్తాం మరియు వాషింగ్టన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆమె స్పష్టం చేశారు.

మదురో ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పుడు అమెరికాను తీవ్రంగా విమర్శించిన డెల్సీ, ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారు. కరాకాస్‌లోని అధ్యక్ష భవనం నుండి ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో అంతర్యుద్ధం రాకూడదనే ఉద్దేశంతోనే తాము అమెరికాతో సహకరించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. ద్రవ్యోల్బణంతో కుదేలైన వెనిజులా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు తొలగిపోవాలని, అందుకు అమెరికా చెప్పినట్లు నడుచుకోవడం ఒక్కటే మార్గమని ఆమె పేర్కొన్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా ఇచ్చే రోడ్ మ్యాప్‌ను అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

రోడ్రిగెజ్ లొంగిపాయారా

డెల్సీ రోడ్రిగెజ్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నిన్నటి వరకు మదురోకు అత్యంత నమ్మకస్తురాలిగా ఉన్న ఆమె, ఒక్కసారిగా అమెరికా వైపు మొగ్గు చూపడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, వైట్ హౌస్ ఈ పరిణామాలను స్వాగతించింది. వెనిజులాలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించేందుకు తాము సహకరిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం ప్రకటించింది. మరోవైపు, వెనిజులాలో తమకు చిరకాల మిత్రురాలిగా ఉన్న డెల్సీ, ఇలా అమెరికాకు లొంగిపోవడంపై రష్యా అసహనం వ్యక్తం చేసింది. ఇది ‘బలవంతపు లొంగుబాటు’ అని మాస్కో వర్గాలు అభివర్ణించాయి.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel