ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి అవుతుంది అనే పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

ఒకవేళ ఆక్సిజనును ఉత్పత్తి చేయగలిగితే మనిషి విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళి జీవించేలా చేయవచ్చు అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.

ఇంతకాలం ఆక్సిజన్ వృక్షాల ద్వారా తయారు అవుతుంది అని, అవి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను వదులుతాయి అని అనుకుంటూనే వచ్చారు. 

అయితే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం క్రింద 4,000 మీటర్లు (సుమారు 13,000 అడుగులు) వద్ద  క్లారియన్-క్లిప్పర్టన్ జోన్ (CCZ) లో ఉన్న ఖనిజ నిక్షేపాల నుండి ఆక్సిజన్‌ వెలువడడం గమనించారు.

ఈ లోతు ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తుఈ లోతు ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తులో దాదాపు సగం. లో దాదాపు సగం.

ఇక్కడ బొగ్గు లాంటి ఖనిజ శిలలు ఉన్నాయి, వీటిని పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అని పిలుస్తారు, వీటిలో సాధారణంగా మాంగనీస్ మరియు ఇనుము ఉంటాయి. ఈ నోడ్యూల్స్ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ లేకుండా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

దీన్ని "డార్క్ ఆక్సిజన్"గా పిలుస్తూ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయోగాలు ఆక్సిజన్ యొక్క మరో మూలాన్ని తేల్చే పనిలో ఉన్నాయి.