Life StyleNationPoliticstrending

RGV Tweet: విమాన దుర్ఘటనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. అంతా దేవుడికే తెలియాలి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ లో ఆయన పహల్గామ్ ఉగ్రవాద దాడి, బెంగళూరు తొక్కిసలాట సంఘటనతో సహా ఇటీవలి వరుస విషాదాలపై విచారం వ్యక్తం చేస్తూ .. “దేవుడికే తెలియాలి ఆయన ఏం చేస్తున్నాడో” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“మీరు సెలవులకు అందమైన ప్రదేశానికి వెళ్తే ఉగ్రవాదులు చంపేశారు.. మీరు ట్రోఫీ పెరేడ్ కి వెళితే తొక్కిసలాటలో చనిపోతారు.. విమానంలో ప్రయాణిస్తే విమానం కూలిపోతుంది.. భోజనం చేయడానికి మెస్ కి వెళ్తే మీ మీద విమానం పడిపోతుంది” అన్నారాయన.