ఘోర ప్రమాదం: అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం ..

Ahmedabad Plane Crash: 12 సిబ్బందితో కలిపి 242 మందితో లండన్ కు మధ్యాహ్నం 1.38 కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేకన్లలో అహ్మదాబాద్ లో కూలిన దుర్ఘటన.. నివాసప్రాంతాలపై కూలడంతో ఆందోళనలో ప్రజలు..

తాజా వార్త: విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ పై కూలినట్లు సమాచారం. భోజన సమయం కావడంతో విద్యార్ధులు మెస్ లోనే ఉన్నారని సమాచారం..

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణికులలో ఒకరు అని సమాచారం.

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి లండన్ బయలు దేరిన విమానం

2010 లో మంగుళూరులో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత అత్యంత ఘోర ప్రమాదం ఇది .

విమానంలో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు కాగా 169 మంది భారతీయులు ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే ..

టేకాఫ్ అయిన బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌ విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా.. సాంకేతిక లోపం జరిగి మధ్యాహ్నం 1.39 సమయంలో చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ విమానం 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా నింపారు. దీనితో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

ఈ ప్రమాదం విషయం తెలియడంతో విజయవాడలో ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ఘటనా స్థలానికి బయల్దేరారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు.

Join WhatsApp Channel