తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల తేదీలను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర జూనియర్ కళాశాలలకు సంబంధించి మే 9 నుంచి మే 31 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు విద్యార్థుల పదో తరగతి గ్రేడు, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయించనున్నారు.
TS Inter Admission 2024-25: తెలంగాణ ఇంటర్ ప్రవేశాలు
Share this Article