DOST 2025-26: తెలంగాణాలో డిగ్రీ ప్రవేశాలకు ధరఖాస్తులు ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. (Degree Online Services, Telangana) దోస్త్ ద్వారా ఆన్ లైన్ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మొదటి విడత ధరఖాస్తు ప్రక్రియ మొదలైంది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇతర వివరాలు, ముఖ్యమైన తేదీల వివరాల్లోకి వెళ్తే ..

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 136 కలుపుకొని మొత్తం 1,054 కళాశాలలు దోస్త్‌ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో గతేడాది గణాంకాల ప్రకారం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఇంకా పెరగవచ్చు.

మొదటి ఫేజ్ దోస్త్ అడ్మిషన్లు

ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మే 3వ తేదీ నుంచి రూ. 200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 21వ తేదీ వరకు గడువు ఉంది. అలాగే మే 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మే 29న మొదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి జూన్ 6లోపు సీటు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

అటు తర్వాత మే 30 నుంచి జూన్‌ 8 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. చివరిదైన మూడో విడత ప్రక్రియ జూన్‌ 13 నుంచి షురూ అవుతుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్‌ 23న సీట్ల కేటాయింపు ఉంటుందని విద్యా మండలి ప్రకటించింది.

జాయిన్ అయిన విద్యార్ధులకు ఫస్ట్ సెమిస్టర్ తరగతులు జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

దీనికి సంబంధించిన ఏదైనా సందేహాలుంటే వాట్స్ ఆప్ నుండి HI అని +91 7901002200 కు మెసేజ్ చేయాలి.

వివరాలకు – ఇక్కడ క్లిక్ చేయండి

Join WhatsApp Channel