Telangana

School Holiday: సోమవారం స్కూళ్లకు సెలవు .. ఎక్కడంటే

తెలుగు రాష్ట్రాలలో దంచికొడుతున్న వానలు నగరాలను ముంచెత్తుతున్నాయి.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలు నీట మునిగాయి. విజయవాడలో నలుగురు, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు.. మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణా విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే హైదరాబాద్ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌ 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు ఫోన్‌ చేసి సమస్యలు తెలపాలని సూచించారు.