Kamareddy: కళ్ళ ముందే కొట్టుకుపోయిన కారు.. నలుగురు

కామారెడ్డి జిల్లా మాందాపూర్ సంగమేశ్వర్ మధ్యలో ఒక కారు వరద నీళ్లలో చిక్కుకుంది. ఆ కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్న పిల్లలు. స్థానికులు క్రేన్ సాయంతో ఆ కారును కాపాడటానికి వెళ్లారు. కానీ అప్పటికే వరద ప్రవాహం ఎక్కువగా కావడంతో కారు కొట్టుకుని పోయింది. కారు ఆచూకి ఇప్పటికీ లభ్యం కాలేదు. మరోవైపు ఉత్తర తెలంగాణాలో భారీగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Join WhatsApp Channel