20 నిమిషాల్లో 2 లీటర్ల నీరు త్రాగిన మహిళ మృతి, ఎందుకంటే…

Photo of author

Eevela_Team

Share this Article

అమెరికాలోని ఇండియానాకు చెందిన యాష్లే సమ్మర్స్ అనే మహిళ జూలై చివరి వారాంతంలో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. అక్కడ ఉన్న మండే ఎండవల్ల కలిగిన అసౌకర్యాన్ని తగ్గించుకోవాలనే ఆశతో తక్కువ వ్యవధిలో నాలుగు బాటిళ్ల నీటిని 20 నిమిషాల్లో త్రాగింది. ఆతర్వాత డీహైడ్రేషన్‌కు గురైంది. ఆమెను హాస్పిటల్ కు తరలించగా ఆమె మరణించింది.

చెమట వల్ల రక్తంలో సోడియం పరిమాణం “అసాధారణంగా తగ్గినపుడు శరీరంలో చేరిన నీటి వల్ల హైపోనట్రేమియాతో ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు. 

ఇలా జరగడం చాల అరుదు. అయినా, తక్కువ సమయంలో ఎక్కువ నీరు త్రాగినప్పుడు లేదా అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల కారణంగా మూత్రపిండాలు ఎక్కువ నీటిని నిలుపుకున్నప్పుడు ఇది సంభవిస్తుంది. శరీరంలో చేరిన నీరు విషంలాగా మారి సాధారణంగా అస్వస్థత మరియు కండరాల తిమ్మిరి, పుండ్లు పడడం, వికారం మరియు తలనొప్పిని కలుగ చేస్తుంది. ఒక్కోసారి మనిషి చనిపోనూ వచ్చు.

ఇలాంటి మరణం వేసవిలో లేదా ఎండలో ఎవరైనా పని చేస్తే లేదా తరచుగా వ్యాయామాలు చేస్తుంటే ఎక్కువగా సంభవిస్తుందని డాక్టర్లు వివరించారు. శరీరంలో నీరు ఎక్కువగా చేరినప్పటికీ ఆ నీటిలో శరీరం కోల్పోయిన దానికి తగినంత సోడియం లేదు, ఇలాంటి సమయాల్లో ఎలక్ట్రోలైట్లు, సోడియం మరియు పొటాషియం ఉన్న వాటిని తాగడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెప్పారు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel