ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనకు ఎవరు వెళతారు అని అడిగితే అందరూ చెప్పేది జగన్ అని. అంతలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ పర్యటనపై ఊదరగొట్టాయి. లండన్ పారిపోతున్నాడు అని.. తిరిగి రాడు అని టిడిపి నేతలు ఎన్నో విమర్శలు చేశారు. నిజానికి జగన్ కోర్టు అనుమతి తోనే లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లారు.
ఇదిలా ఉంచితే ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు అమెరికా పర్యటన పెట్టుకున్నారు. నిజానికి ఎన్నికల తర్వాత చంద్రబాబు ఫ్యామిలీతో పుణ్యక్షేత్రాల సందర్శనకు
వెళ్తారని స్వంత మీడియాలో ఎక్కడలేని ప్రచారం చేశారు. కానీ అటునుంచి అలా విదేశాలకు వెళ్తుంటే
మాత్రం ఏమీ ఎరగనట్టు సైలెంట్ గా ఉంది ఆ మీడియా.
లోకేష్ అమెరికా నాలుగురోజుల క్రితమే వెళ్లారు. ఆ విషయం పార్టీ నేతలకు కూడా తెలీదు. ఇప్పుడు ఆయన వెనకే చంద్రబాబు కూడా అమెరికా పర్యటనకు రడీ అయ్యారు. అయితే కేసుల్లో బెయిల్ పై ఉన్నచంద్రబాబుని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో
అసలు విషయం బయటపడింది. బాబు అమెరికా పర్యటన వ్యవహారం గుట్టు రట్టయింది.
స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల
శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ గతంలో లుక్ అవుట్ నోటీసులు జారీ
చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేనిదే వారు విదేశాలకు వెళ్లకూడదు.
అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లాలనుకున్నారు. మరోవైపు ఫైబర్
నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగా చంద్రబాబు
కోర్టుకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లాలనుకోవడం విశేషం. దీంతో
ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్
లో కాసేపు చర్చ జరిగింది. సీఐడీ అధికారుల వివరణ తీసుకున్నారు.
ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు అనుమతి లభించింది. దీంతో చంద్రబాబు తన
సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.
అయితే చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళుతున్నారని చెపుతున్నా ఆ పర్యటనలో ఆయన ఎవరిని కలుస్తారు.. ఏమి చేస్తారు అనేదానిపై పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఫైబర్
నెట్ కేసులో పరారీలో ఉన్న పెండ్యాల
శ్రీనివాస్ ని కలుస్తారని కొందరూ, సింగపూర్ మాజీ మంత్రితో భేటీ అవుతారని కొందరూ చెపుతున్నారు. ఆయనపై అమెరికాలో ఉన్న కొందరు వైసీపీ ఎన్నారైలు నిఘా పట్టినట్లు చెపుతున్నారు.. త్వరలో ఆయన పర్యటన వివరాలు బయటికి రావొచ్చు.
పెద్ద .. ప్లానే