ఈరోజు టిడిపి- జనసేన సంయుక్తంగా తమ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అలాగే టిడిపి 94 శతానాల్లో తమ అభ్యర్ధులను ప్రకటించారు. తమ జాబితాలో తెలుగుదేశం సీనియర్లను, పార్టీని నమ్ముకున్న వారిని ప్రక్కన పెట్టి బయటి నుంచి వచ్చిన వారికి, ధనవంతులకు పెద్దపీట వేశారు. జనసేన కూడా తన లిస్ట్ లో వలస నాయకులకే పెద్దపీట వేశారు.
కేవలం 24 సీట్లు ఇచ్చి తెలుగుదేశం తమను అవమానపరచింది అని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు. ఈ సీట్లతో పవన్ ముఖ్యమంత్రి కావడం ఎలా సాధ్యం అని వారు ప్రశ్నిస్తున్నారు. మన మీద ఆధారపడి టిడిపి ప్రభుత్వం ఉంటుంది అనుకున్నాం అని, ఉపయోగంలేని పొత్తు కోసం కాపుల వోట్లు ఎలా తాకట్టు పెడతారు అని పలువురు కాపు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అయితే వోట్ల బదిలీ జరిగే అవకాశం లేదు అని విశ్లేషకుల అంచనా!
ఇప్పటికే పెనుగొండ, పి. గన్నవరం, పెడన టిడిపిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ముందు ముందు మరిన్ని స్థానాల్లో అసమ్మతి చెలరేగే అవకాశం ఉంది.