వసంత ప్రసాద్ చెరికతో మైలవరం తెలుగుదేశం పార్టీలో సీటు రగడ మరింత ముదిరింది. తనకే సీటు వస్తుందని వసంత ప్రసాద్ భావిస్తుండగా సీటుకోసం ఒకవైపు దేవినేని ఉమ, మరోవైపు బొమ్మసాని సుబ్బారావు తమ వంతు తాము ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేనినేని, బొమ్మసాని చేతులు కలిపి వసంత కృష్ణ ప్రసాద్ ని ఎట్టిపరిస్టితుల్లోనూ సీటు రాకూడదని తమ ఇద్దరిలో ఎవరికి సీటు వచ్చినా కలిసి పని చేయాలని నిర్ణయించారు. నిజానికి వారిద్దరి వైరం ఈనాటిది కాదు.. అటువంటి వారు కలిసి వసంతకు సీటు రాకూడదని గట్టిగా పోరాడుతున్నారు.
ఇదిలా ఉండగా వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తనకు బొమ్మసాని సోదరుడు లాంటి వాడు అని ఉమా ఒక్కడే తనతో కలిసి పనిచేయడం ఏంటి, చెపితే ముగ్గురం కలిసి పనిచేద్దాం అన్నారు.
ఈ విధంగా చూస్తే ఉమాకు, వసంతకు ఇద్దరికీ బొమ్మసాని ఆమోదయోగ్యుడు అనిపిస్తోంది. ఒకవేళ మధ్యే మార్గంగా బొమ్మసానికి సీటు ఇస్తే ఇద్దరూ ఆమోదించక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.