మొత్తానికి పొత్తు ఖరారైంది. టిడిపి మొదటి లిస్టు రిలీజైంది. దీనిలో అనేకమంది సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రాజమండ్రి సిటీ స్థానానికి ప్రస్తునా ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుని ఎంపిక చేయగా, రూరల్ లో సీటు ఆశించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లిస్ట్ లో స్థానం లేకపోవడంతో నిరాశే మిగిలింది. అయితే ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాలలో ఆసక్తి చర్చకు దారితీసింది.
ఆయన తన ట్విట్టర్ లో చేసిన పోస్టు బుచ్చయ్య చౌదరి టిడిపిని వీడనున్నారా అన్న సందేహాన్ని పుట్టిస్తుంది. “సింహానిదే సింహాసనం” అని ఆయన తనది మరియు సింహానిది బ్యానర్ పెట్టారు. దీనికి పార్టీ వీడడానికి ఏంటి సంబంధం అంటే, చంద్రబాబు ఎన్టీయార్ ను పదవి నుంచి దించిన తర్వాత బుచ్చయ్య చౌదరి ఎన్టీయార్ వెంట నడిచి ఆయన పార్టీ ఎన్టీయార్ తెలుగుదేశం గుర్తు అయిన “సింహం గుర్తు” పై పోటీ చేశారు. ఇప్పుడు తన బ్యానర్ పై సింహం ఫోటోను ఉంచడం దేనికి సంకేతం? ఇదీ రాజకీయ వర్గాలలో చర్చ!
మరి గోరంట్ల ఏవిధంగా ఆలోచించి తన పోస్టు పెట్టారో ఆయనే చెప్పాలి
#TDPJSPTogether#CBNForCM pic.twitter.com/LAtjNmxzn6
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 23, 2024