దిగిపోయిన జగన్ సర్కార్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సజ్జల టార్గెట్ గా మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఆ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. .
తెలంగాణలో లాగానే ఏపీలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, పలు ప్రజాప్రతినిధుల
ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు. దీని
ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు. వైకాపా ప్రభుత్వం చేసిన
ఈ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్
చేశారు.
చాలా నెలల క్రితమే వైకాపా నుంచి పార్టీ మారిన నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇదే ఆరోపణ చేశారు.
ఇప్పుడు క్రొత్త పోలీస్ బాస్ రాగానే ఈ ఆరోపణలపై కమిటీ వేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది.