17 జూన్ 2024 పంచాంగం : నిర్జల ఏకాదశి మరియు గాయత్రీ జయంతి

Photo of author

Eevela_Team

Share this Article

 సోమవారం గ్రహ బలం పంచాంగం 

సోమవారం గ్రహాధిపతి “చంద్రుడు”.  చంద్రుని అధిష్టాన దైవం పార్వతి దేవి మరియు వరుణుడు. 

చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 

1. ఓం సోమాయ నమః || 

2. ఓం శ్రీమాత్రే నమః || 

3. ఓం వరుణాయ నమః || 

చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతి దేవి సమేత శివాలయాలను దర్శించండి. శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం, శివ స్తోత్రాలు, దేవి స్తోత్రాలు పఠించండి.  

సోమవారం కొత్త ఆలోచనలు చేయడానికి, బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహా పనులకు అనుకూలం. జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం చేయకండి. కఠినంగా కాకుండా, మృదు స్వభావాన్ని కలిగి ఉండండి. 

గ్రహ బలం కొరకు, సోమవారం తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి.  సోమవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, 

తిథి: 

ఏకాదశి : Jun 17 04:43 AM to Jun 18 06:25 AM 

ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. ఏకాదశి ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, శారీరక వ్యాయామాలు, నిర్మాణం, తీర్థయాత్ర, ఉత్సవాలు, అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి.   

ఏకాదశి తిథి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, ఉపవాసం ఉండటానికి, శ్రీ మహా విష్ణు ఆరాధనకు, శ్రీ మహా విష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.  

నక్షత్రం: 

చిత్తా: Jun 16 11:12 AM to Jun 17 01:50 PM

స్వాతి: Jun 17 01:50 PM to Jun 18 03:56 PM 

చిత్త (చిత్ర) నక్షత్రానికి అధిపతి “కుజుడు”. అధిష్టాన దేవత “త్వష్ట”.  ఇది మృదువైన సున్నిత స్వభావం గల నక్షత్రం.  

చిత్త/చిత్ర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 

1. ఓం భౌమాయ నమః ||

2. ఓం విశ్వకర్మణే నమః ||

చిత్త/చిత్ర నక్షత్రం ఉన్నరోజు లలిత కళలు నేర్చుకోవడం, స్నేహం చేయడం, ఇంద్రియ సుఖాలు, అలంకారాలు, లైంగిక కార్యకలాపాలు, కొత్త దుస్తులు ధరించడం, వివాహ ప్రయత్నాలు, గానం, నృత్యం, ఊరేగింపులు, శుభకార్యాలు, వేడుకలు, వ్యవసాయం మరియు ప్రయాణాలకు అనుకూలం. 

అమృత కాలం:  

06:43 AM – 08:30 AM

దుర్ముహూర్తం: 

12:38 PM – 01:30 PM, 03:12 PM – 04:03 PM

వర్జ్యం:  

07:55 PM – 09:39 PM

Join WhatsApp Channel
Join WhatsApp Channel