రాబోయే వేసవి రద్దీని తట్టుకునేదుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 9,111 అదనపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికం. గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపింది రైల్వే శాఖ.
ఆ శాంశంపై ఈరోజు రైల్వే శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపాం. ఈసారి ఆ సంఖ్యను 9111కు పెంచాం. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో రైల్వేశాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ డిమాండ్ పెరిగితే మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, తాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.