Sakshi News Portal: క్రొత్త రూపంలో "సాక్షి" పోర్టల్ .. ఇలా ఐపోయిందేంటి..

Photo of author

Eevela_Team

Share this Article

కొద్ది గంటల క్రితం నుంచి సాక్షి న్యూస్ పోర్టల్ క్రొత్త రూపంలో దర్శనం ఇస్తుంది. కొద్ది రోజుల ముందే సాక్షి టీవి కలర్ ను పసుపు, ఎరుపుల కలయిక నుంచి లైట్ నీలిరంగులోకి మార్చారు. ఆ కలర్ బాగోలేదు అని, అక్షరాలు కనపడడం లేదు అని, రంగులో కలిసి పోయాయి అని ఎంతోమంది గగ్గోలు పెట్టారు. అయినా దాన్నే కొనసాగించారు. దీనికి కారణంగా జాతీయ మీడియాగా సాక్షి మారబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు వెబ్సైట్ కూడా లేత నీలి రంగులోకి మారిపోయింది. డిజైన్ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకోవాల్సిన టెక్నికల్ టీం ఎన్నో లోపాలతో ఉన్న క్రొత్త వర్షన్ ని హడావుడిగా తీసుకు వచ్చారు. సరైన ఫాంట్ లేక, అతి చిన్న సైజులో ఉన్న అక్షరాలతో పురాతన కాలం నాటి డిజైన్ ను తీసుకు రావడం ఎందుకో అర్ధం కాలేదు. గూగుల్ అనువాద బటన్ ను ఉంచారు .. అది ఎందుకో ఎవరికీ అర్ధం కాదు. ఇప్పటికే ఆంగ్ల వర్షన్ ఉండగా గజిబిజిగా అనువాదం చేసే ఈ బటన్ ఎందుకో తెలీదు.

ఈ విషయమై సాంకేతిక విభాగాని సంప్రదించగా . జాతీయ మీడియా రూపంలో తీస్కు వస్తున్నాం అని , చిన్న చిన్న లోపాలు రెండు రోజుల్లో సవారిస్తాం అని చెప్పారు. చిన్న లోపాలు కాదు అసలు పూర్తి వెబ్సైట్ గందరగోళంగా తయారైంది.

Join WhatsApp Channel
Join WhatsApp Channel