MP Fire Accident: బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

Photo of author

Eevela_Team

Share this Article


హర్దా.
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ భారీ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 59 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఘటనా స్థలంలో మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీలో ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఫ్యాక్టరీలో పటాకుల కోసం ఉంచిన గన్‌పౌడర్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుళ్లతో దాదాపు 20 కిలోమీటర్ల మేర ప్రజల ఇళ్లు దద్దరిల్లాయి.

ఈ ఘటనపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, ఏసీఎస్ అజిత్ కేసరి, డీజీ హోంగార్డ్ శ్రీ అరవింద్ కుమార్‌లను హెలికాప్టర్‌లో బయలుదేరాల్సిందిగా ఆదేశించారు

మంటల్లో కాలిపోయిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాణసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పటాకులు వేగంగా పేలుతున్నందున, వాటి నిప్పురవ్వలు చాలా దూరం చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంటలను అదుపు చేయడంలో జాప్యం జరుగుతోంది. అయితే ఫ్యాక్టరీలో ఇంకా ఎంత మంది చిక్కుకుపోయారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. సహాయక చర్యలు చేపట్టేందుకు బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

Join WhatsApp Channel
Join WhatsApp Channel