Jagan: జగన్ ని జైలుకి పంపేందుకు తల్లి, చెల్లి కుట్ర

Photo of author

Eevela_Team

Share this Article

వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుకి పంపేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ స్కెచ్ వేశారా? వారి కుట్రను అతి నేర్పుగా జగన్ తెలుసుకుని భగ్నం చేయగలిగారా? .. అవుననే అంటున్నారు విశ్లేషకులు.

జగన్ ని జైలుకి పంపేందుకు కూతురు షర్మిళతో విజయమ్మ కూడా చేతులు కలిపి జప్తులో ఉన్న ఆస్తులు బడలాయింపుకి ప్రణాళిక రచించడం.. వారి వ్యవహారాన్ని పసిగట్టిన జగన్ తాను వారికి ఇచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకోడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్పీలు చేయడం చూస్తే ఇదంతా నిజమనే అనిపిస్తుంది.

వైఎస్ షర్మిళకు ఛీటర్ గా పేర్కొంటూ జగన్ NCLT ని ఆశ్రయించారు.

నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కున్నారు. ఆనాడు కోర్టు ఆయనకు చెందిన కొన్ని ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అటుతర్వాత వాటిలోని సరస్వతి పవర్ కి చెందిన తన షేర్లలో కొన్నిటిని (1%) తన చెల్లికి తల్లి ద్వారా పంచుతూ ఒప్పందం చేసుకున్నారు. అయితే వాటిని అమ్మడానికి, వేరే వారికి బడలాయించడానికి కుదరదు. అలా చేస్తే జగన్ పై కోర్టు ధిక్కారణ నేరం వచ్చి తిరిగి జైలుకి పోయే అవకాశం ఉంది.

ఇప్పడు ఆ కంపెనీలోని షేర్లను బదలాయింపు కోరుతూ షర్మిళ విజయమ్మతో కలిసి చేసిన ప్రయత్నం బయటపడడం తీవ్ర సంచలనంగా మారే అవకాశం ఉంది.

Join WhatsApp Channel
Join WhatsApp Channel