Indian Navy Agniveer: ఇండియన్‌ నేవీలో అగ్నివీర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

Photo of author

Eevela_Team

Share this Article

 

ఐఎన్‌ఎస్‌ చిల్కాలో
శిక్షణ కోసం భారత నౌకాదళం అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. అగ్నివీర్‌ (ఎంఆర్‌) ఖాళీల
భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది . అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు
దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థి 01.11.2003 నుంచి 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి.

జీతం:  ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000.

ఎంపిక
విధానం:
 
అప్లికేషన్‌
షార్ట్‌లిస్టింగ్, స్టేజ్‌–1(ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌
టెస్ట్‌),స్టేజ్‌–2(రాతపరీక్ష,శారీరక దారుఢ్య పరీక్ష–పీఎఫ్‌టీ), వైద్య
పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

 పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత
పరీక్షలో ప్రశ్నపత్రం హిందీ /ఇంగ్లిష్‌ భాషల్లో మొత్తం 50
బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 50
మార్కులు ఉంటాయి. సైన్స్, మ్యాథమేటిక్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల
నుంచి పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు.
నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. 

దరఖాస్తు
విధానం:
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది:
27.05.2024.

వెబ్‌సైట్‌:
www.joinindiannavy.gov.in

నోటిఫికేషన్
వివరాలు:
 ఇక్కడ క్లిక్ చేయండి

 

Join WhatsApp Channel
Join WhatsApp Channel