హిమాచల్ వర్షాలకు 51 మంది మృతి – సిమ్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృత్యవాత

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టించడంతో కనీసం 51 మంది మృతి చెందారు, కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రోడ్లు మూసుకుపోయాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, సిమ్లాలోని ఆలయ శిథిలాలలో భక్తులు సమాధి అయ్యారు.

రాష్ట్ర రాజధానిలో రెండు కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల నుండి పద్నాలుగు మృతదేహాలను వెలికితీశారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం శిధిలాల కింద ఇంకా ఎక్కువ మంది చిక్కుకున్నారని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు శ్రావణ మాస పూజల్లో ఈ మందిరం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇకపోతే, మండి జిల్లాలో వర్షాల కారణంగా 19 మంది మరణించారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి పిటిఐకి తెలిపారు.

Related posts

దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

భారత్-అమెరికా డీల్‌తో బంగ్లాదేశ్ తరహాలోనే భారత వస్త్రాలకూ ‘జీరో డ్యూటీ’:  పియూష్ గోయల్ వెల్లడి