OG: టికెట్ రేట్లు పెంచడం కుదరదు: హైకోర్ట్

భారీ అంచనాలతో ఈరోజు విడుదల కాబోతున్న పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పెంచిన ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

టికెట్ రేట్ల పెంపు మెమో ద్వారా 24న రాత్రి వేసే ప్రీమియర్‌కు తెలంగాణలో రూ.800 టికెట్‌ ధర(జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో తెలంగాణలో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.

Join WhatsApp Channel