Life StylePanchangamtrending

DIwali 2025: దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20నా లేక 21నా? లక్ష్మీ పూజ సమయం?

దీపావళి పండుగ పిల్లలూ, పెద్దలూ ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగ. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళికి ఎంతో చరిత్ర, ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో అస్పష్టత నెలకొంది. దీనికి కారణం, క్యాలెండర్‌లో అమావాస్య తిథి అక్టోబరు 20వ తేదీ మధ్యాహ్నం దాటాక వచ్చి 21 సాయంత్రం దాకా ఉంది! దీనితో దీపావళి పండుగ ఏ రోజు జరుపుకొవాలనేదానిపై అందరిలో సందేహం నెలకొంది. పంచాగకర్తలు, పండితులు ఎం చెపుతున్నారో ఇప్పుడు చూద్దాం…

ప్రతీ ఏటా దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దృక్ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2. 40 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా అమావాస్య రాత్రి సమయంలో ఉన్నప్పుడే దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ 20వ తేదీనే ఉంది. అందుకే ఆ రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

ఇకపోతే, 20న పూర్తి ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు ఉంటుందని వివరించారు. లక్ష్మీ పూజ కూడా అదే రోజు రాత్రి జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆ రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల మధ్య జరుపుకోవాలని వివరిస్తున్నారు.

లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి?

దీపావళి అమావాస్య సాయంత్రం ప్రతిఒక్కరు లక్ష్మీపూజ తప్పనిసరిగా చేస్తారు. 20న పూర్తి ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు ఉంటుందని వివరించారు. లక్ష్మీ పూజ కూడా అదే రోజు రాత్రి జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు. ఆ రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల మధ్య జరుపుకోవాలని వివరిస్తున్నారు. ఈ ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతున్నారు.

నరక చతుర్ధశి ఎప్పుడు?

హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిధి ఉన్న రోజు పండుగలు జరుపుకోవాలి. కానీ ఇది అమావాస్య రోజు జరుపుకునే దీపావళి పండుగకు, పౌర్ణమి రోజు జరుపుకునే కార్తీక పౌర్ణమి పండుగలకు వర్తించదు. వీటిని రాత్రివేళ తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. ఈ క్రమంలో ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ 20, సోమవారం మధ్యాహ్నం 3.44 గంటల వరకు ఉంది కాబట్టి ఇదే రోజు ఉదయం నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. సాయంత్రం దీపావళి అమావాస్య పండుగ జరుపుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఇలా రెండు పండుగలు ఒకేరోజు రావడం అరుదైన విషయమని పండితులు చెబుతున్నారు.