ఆంధ్ర ప్రదేశ్ స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs)- స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, విజయవాడ 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకం కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. చివరి తేదీ జులై 18,
మొత్తం పోస్టుల సంఖ్య: 170 (వీటిలో 68 ఓపెన్)
అర్హత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.దీనితో పాటూ కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. మైక్రో ఫైనాన్స్, రూరల్ డెవెలప్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉండడం మంచిది.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది)
జీతం: నెలకు రూ.25,000- రూ.30,000+ ఇతర అలవెన్సులు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.07.2025.
వెబ్‌సైట్: https://streenidhi-apamrecruitment.aptonline.in/
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి