Andhra PradeshJobs

APPSC: ఏపీ అటవీ శాఖలో 691 ఉద్యోగాలకు చివరి తేదీ ఆగస్టు 5, పూర్తి వివరాలు!

APPSC Forest Beat Officer Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 691 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల అప్లికేషన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) జారీ చేసిన ఈ నోటీఫికేషన్ ద్వారా 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులు భర్తీ కానున్నాయి.

జూలై 16 న మొదలైన అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ తో ముగియనుంది. పూర్తి వివరాలను https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పోస్టుల వివరాలు:

1. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీఓ)- 256
2. అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఏబీఓ)- 435

మొత్తం పోస్టులు : 691

విభాగాలు : అటవీశాఖ

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తిస్తాయి.

వయసు: 2025 జులై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌కు రూ.25,220- రూ.80,910; అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌కు రూ.23,120- రూ.74,770.

ఎంపిక విధానం:  స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్‌ బేస్డ్‌), మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌, నడక / మెడికల్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియేన్సీ టెస్ట్‌

దరఖాస్తు విధానం: https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా ఓబీపీఆర్‌ (One Time Profile Registration) చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05/08/2025

వెబ్‌సైట్‌: https://portal-psc.ap.gov.in/Default

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి