East Godavari: స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్
భారీ వర్షాల నేపధ్యంలో సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు , అంగన్వాడి కేంద్రాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాబోయే 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీని కారణంతో జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కాలేజీలకు, డిగ్రీ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.

