AP POLYCET 2025 Counselling: ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు,తేదీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను  సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాలీసెట్ 2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులు 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సులకు ధరఖాస్తు జూన్ 20వ తేదీ నుంచి చేసుకోవచ్చు.

ఈ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ (1st Phase Counselling) కోసం మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు వచ్చిన అభ్యర్థులకు ఫీజు చెల్లించడానికి జూన్ 27వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దీనికోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.250 చొప్పున ఫీజు చెల్లించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన జూన్‌ 21 నుంచి 28 వరకు ఉంటుందని. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల (Options Entry) నమోదు ప్రక్రియ జూన్‌ 25 నుంచి 30 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

అలాగే జులై 1న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఉంటుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 3న సాయంత్రం 6 గంటల తర్వాత జరుగుతుందని కన్వీనర్ తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 4 నుంచి 8 లోపు కళాశాలల్లో చేరాలని ఈ అధికారిక ప్రకటనలో తెలిపారు. 

కాగా, మే 14 న విడుదలైన ఏపీ పాలిసెట్ 2025 ఫలితాల్లో 1,33,358 మంది అభ్యర్థులు (95.36 శాతం) కౌన్సిలింగ్ కోసం అర్హత సాధించిన విషయం తెలిసిందే. కౌన్సిలింగ్ కు సంబంధించి సందేహాలకు హెల్ప్ లైన్ నెంబర్లు – 7995681678, 7995865456, 9177927677 లకు పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్‌ ద్వారా లేదా మెయిల్ ఐడీ – convenorpolycetap2025@gmail.com తో కానీ సంప్రదించవచ్చు .

Join WhatsApp Channel