AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్‌ ఫ‌లితాల విడుద‌ల‌ ఎప్పుడంటే ..

 

AP EAPCET Results 2024 : ఏపీ ఈఏపీసెట్‌ ఫ‌లితాల విడుద‌ల‌ ఎప్పుడంటే ..

AP EAPCET Results 2024: ఇటీవ‌లే తెలంగాణ‌లో ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) ప‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం
తెల్సిందే. ఇప్పటికే తెలంగాణ‌లో ఈఏపీసెట్‌-2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా
విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ఈఏపీసెట్‌-2024 ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల
చేసేందుకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఏర్పాట్లును
చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే 

AP EAMCET 2024 ఫ‌లితాల‌ను మే 31వ తేదీన లేదా.. జూన్ మొద‌టి వారంలో విడుద‌ల
చేసేందుకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఏర్పాట్లు
చేస్తున్నారు. AP EAMCET 2024 ఫ‌లితాల విడుద‌ల‌తో పాటు.. కౌన్సిలింగ్
షెడ్యూల్ కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ఏపీ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) ప్రిలిమినరీ కీ ని విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ పరీక్షలను మే 16,17 తేదీల్లో 4 సెషన్స్‌లో
నిర్వహించారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు.. మే 18వ తేదీ నుండి 23వ తేదీ
వరకు 9 సెషన్స్ లో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే
పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2.30
నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించారు.

Join WhatsApp Channel