Andhra PradeshDevotionaltrending

Dasara at Viyajawada 2025: విజయవాడ ఇంద్రకీలాద్రి పై రోజు వారి అమ్మవారి అలంకారాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో ఈ సంవత్సరం 11 రోజులపాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 2025 సెప్టెంబర్‌ 22 నుండి అక్టోబర్‌ 2వ తేదీ వరకు జరుగు శ్రీ అమ్మవారి 11 విశేష అలంకరణ వివరములు మరియు దర్శన వేళలు, దర్శన సమయం

తేదీ , వారం దర్శన సమయంతిథి అమ్మవారి అలంకారం
సెప్టెంబర్ 22ఆశ్వీయుజ శుద్ధ
పాడ్యమి
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 23ఆశ్వీయుజ శుద్ధ
విధియ
శ్రీ గాయత్రి దేవి
సెప్టెంబర్ 24ఆశ్వీయుజ శుద్ధ
తధియ
శ్రీ అన్నపూర్ణా దేవి
సెప్టెంబర్ 25ఆశ్వీయుజ శుద్ధ
చవితి
శ్రీ కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26ఆశ్వీయుజ శుద్ధ
చవితి
శ్రీ మహాలక్ష్మీ దేవి
సెప్టెంబర్ 27ఆశ్వీయుజశుద్ద పంచమిశ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 28ఆశ్వీయుజశుద్ద షష్టిశ్రీ మహాచండి దేవి
సెప్టెంబర్ 29ఆశ్వీయుజ శుద్ధ సప్తమి (మూలా నక్షత్రం)శ్రీ సరస్వతీ దేవి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మధ్యాహ్నం గంటలు 3:30 ని.ల నుండి గంటలు 4:30 ని.ల మధ్య శ్రీ కనకదుర్గమ్మ వారికి రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.)
సెప్టెంబర్ 30ఆశ్వీయుజ శుద్ధ
అష్టమి (దుర్గాష్టమి)
శ్రీ దుర్గా దేవి
అక్టోబర్‌ 1ఆశ్వీయుజ శుద్ధ నవమి
(మహర్నవమి)
శ్రీ మహిషాసుర మర్దిని దేవి
అక్టోబర్‌ 2ఆశ్వీయుజ శుద్ధ
దశమి
(విజయదశమి)
శ్రీ రాజరాజేశ్వరి దేవి

మహానీవేదన మరియు పంచహారతులు:

సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6.30 ని.ల నుండి 7.30 ని.ల వరకు శ్రీ అమ్మవారి మహానీవేదన మరియు పంచహారతులు నిమిత్తం భక్తులకు అన్ని దర్శనములు నిలుపుదల చేయబడును.

దసరా మహోత్సవములలో ప్రత్యేక ఆర్జిత సేవలు

ప్రత్యేక ఖడ్గమాలారన పూజ

రుసుము రూ.5,116/-, పూజా సమయం: ఉదయం 7 గంటల నుండి పూజ జరుగు ప్రదేశము: మహామంటపం 6వ అంతస్తు

ప్రత్యేక కుంకుమార్చన

పూజ రుసుము రూ.3,000/-

ప్రత్యేక కుంకుమార్చన పూజలు రెండు బ్యాచ్లుగా నిర్వహించబడును. మొదటి బ్యాచ్ సమయం: ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. రెండవ బ్యాచ్ సమయం: ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.

మూలా నక్షత్రం రోజు తేది. 29.09.2025న శ్రీఅమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం (శ్రీసరస్వతీదేవి అలంకారం) రోజున పూజ రుసుము రూ.5,000/-

పూజ జరుగు ప్రదేశము : మహామంటపం 6వ అంతస్తు.

ప్రత్యేక శ్రీ చక్ర నవావరణార్చన పూజ

రుసుము రూ.3,000/- పూజ జరుగుప్రదేశము : మహామంటపం 6వ అంతస్తు.

ప్రత్యేక చండీహోమము

పూజ రుసుము : రూ.4,000/- పూజా సమయం: ఉదయం 07 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. పూజ జరుగు ప్రదేశము: ప్రస్తుతం చండీహోమం జరుగు యాగశాల.

పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని ప్రధాన శక్తిక్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రము విశిష్టమైనది, మహిమాన్వితమైనది. పరమపావన కృష్ణానదీతీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ మల్లేశ్వరస్వామివారు స్వయంగా అవతరించటం విశేషం. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిలను పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. వేదమంత్రాలతో, స్తోత్రాలతో భక్తులుగావించే శ్రీ దుర్గామల్లేశ్వరుల దివ్యనామస్మరణలతో ఇంద్రకీలాద్రిక్షేత్రం అపరకైలాసంగా వెలుగొందుతున్నది. శ్రీ అమ్మవారి మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు ఘోరతపస్సు చేయగా, అతని భక్తికి మెచ్చి శ్రీ అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా, ‘పరాశక్తి అయిన మీరు నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని’ వరం అడుగగా శ్రీఅమ్మవారు కీలునితో నీవు అద్రి (కొండ) రూపంలో ఉండమని త్వరలోనే ఈ అద్రిపై స్వయంభువుగా ఆవిర్భవిస్తానని వరమిచ్చి అనుగ్రహించింది. కీలుడు ఆనందభరితుడై అద్రిగా మారగా, కొంతకాలానికి దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా వెలసింది. విజయవాడనగరమును పరిపాలిస్తున్న మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి. కనకవర్షం కురిపించి శ్రీ కనకదుర్గాదేవిగా కీర్తించబడుచున్నది. ఇంద్రుడు శ్రీఅమ్మవారి దర్శనమునకు మొదటగా రావటం వలన ఈ పర్వతం ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందింది.

శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆవిర్భావం

శ్రీ అమ్మవారు కొలువైన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు
శ్రీ మల్లేశ్వరస్వామిగా అవతరించి భక్తులకు కరుణను అనుగ్రహిస్తున్నారు. ద్వాపరయుగంలో అర్జునుడు వనవాససమయంలో
శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞమేరకు శ్రీ దుర్గా అమ్మవారిని కొలిచి శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది, శ్రీ అమ్మవారి ఆజ్ఞ
మేరకు పరమేశ్వరుని అనుగ్రహముతో పాశుపతాస్త్రాన్ని కోరుటకు ఇంద్రకీలాద్రిపై తపస్సుగావించాడు. అర్జునుడి
భుజబలాన్ని, మనోధైర్యాన్ని వాక్ వైఖరిని పరీక్షించాలని సతీసమేతంగా పరమేశ్వరుడు కిరాతునిరూపాన్ని ధరించి అర్జునునితో
వాదించి,మల్లయుద్ధం గావించి, అతని శక్తికి సంతసించి, నిజరూపంతో సాక్షాత్కరించి, ప్రీతితో పాశుపతాస్త్రాన్ని
ప్రసాదించాడు. లోకంలో ఎక్కడా కనిపించని ఒక వైశిష్ట్యం ఈ క్షేత్రానికి ఉంది. శ్రీకనకదుర్గ అమ్మవారి ఈ ఇంద్రకీలాద్రిక్షేత్రానికి
రుద్రాంశసంభూతుడైన శ్రీఅభయాంజనేయస్వామి క్షేత్రపాలకుడుగా భక్తులను, క్షేత్రమును రక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం
నాలుగు దిశలవైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామివారు కొలువై ఉండటం విశేషం.

శ్రీ కనకదుర్గమ్మ వారి వైశిష్ట్యము

దుర్గమాసుర సంహారంచేసిన అనంతరం శ్రీదుర్గాదేవి ఉగ్రరూపంతో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీఆది
శంకరాచార్యుల వారు దుర్గమ్మను భక్తులపాలిట కల్పవల్లిగా, శాంతస్వరూపిణిగా ఉంచాలని భావించి శ్రీ అమ్మవారి పాదాలచెంత
శ్రీచక్ర ప్రతిష్టాపనచేసి వైదికపరమైన స్తోత్రాలతో శ్రీసూక్త విధానంగా కుంకుమతో పూజలు నిర్దేశం చేయగా, ఆనాటి నుండి
శ్రీఅమ్మవారికి సమయాచార విధానంతో నేటికీ అవిచ్ఛిన్నంగా పూజలు నిర్వహించబడుచున్నాయి.

తరతరాలుగా ఇంద్రకీలాద్రి
క్షేత్రం పై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు శరన్నవరాత్రులు శ్రీ అమ్మవారికి అత్యంత వైభవంగా
నిర్వహించబడుతున్నాయి. విజయదశమి పర్వదినమున శ్రీ దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో హంసవాహనంపై జలవిహారం
చేస్తారు.