22.2 C
Hyderabad
Sunday, January 18, 2026
HomePanchangamToday Panchangam in Telugu ఈరోజు తిథి పంచాంగం, మంచి గడియలు

Today Panchangam in Telugu ఈరోజు తిథి పంచాంగం, మంచి గడియలు

ఈరోజు తెలుగు పంచాంగం తిథి, వార, నక్షత్రం తో పాటూ ఇతర వివరములతో ఇక్కడ ఇవ్వబడినది.

🕉️ 18 జనవరి 2026 🕉️

🚩 మౌని అమావాస్య, ఆదివారం అమావాస్య 🚩

ఆదివారం గ్రహబలం పంచాంగం

ఆదివారం గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు (శివుడు).

సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం సూర్యాయ నమః ||
  2. ఓం అగ్నయే నమః ||
  3. ఓం రుద్రాయ నమః ||

సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించండి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు, శివ స్తోత్రాలు పఠించండి.

ఆదివారం బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబందించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలం. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా గడపండి.

గ్రహ బలం కొరకు, ఆదివారం సింధూరం, నారింజ, మరియు కాషాయం రంగు దుస్తులు ధరించండి. ఆదివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అనారోగ్యాలు కలుగుతుంది. అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతుంది.

అమృత కాలం:
05:05 AM – 06:49 AM, 05:01 AM – 06:43 AM

దుర్ముహూర్తం:
04:31 PM – 05:16 PM

వర్జ్యం:
06:47 PM – 08:30 PM

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్య మాసం, కృష్ణ పక్షం,

తిథి:
అమావాస్య: జనవరి 18 ఉదయం 12:04 నుండి జనవరి 19 ఉదయం 01:21 వరకు
శుక్ల పక్ష పాడ్యమి: జనవరి 19 ఉదయం 01:21 నుండి జనవరి 20 ఉదయం 02:14 వరకు

అమావాస్య పూర్ణ తిథి. స్వభావం ప్రకారం ఇది పూర్ణ తిథి అయినప్పటికీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దాతృత్వం, దానాలు మరియు మరణించిన వారికి ఆచారాలు చేయడం మినహా ఇతర మంచి పనులకు ఇది ప్రతికూలమైన తిథి.

అమావాస్య తిథి, సాయంత్రం దీపాలు పెట్టిన తరువాత, శ్రీ మహా లక్ష్మీ అమ్మవారిని, దీప, దూప, నైవేద్యాలతో పూజించడానికి, శ్రీ సూక్తాన్ని, శ్రీ కనకధారా స్తోత్రాన్ని, శ్రీ మహా లక్ష్మీ మంత్రాలను పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నక్షత్రం:
పూర్వాషాఢ: జనవరి 17 ఉదయం 08:12 నుండి జనవరి 18 ఉదయం 10:14 వరకు
ఉత్తరాషాఢ: జనవరి 18 ఉదయం 10:14 నుండి జనవరి 19 ఉదయం 11:52 వరకు

పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి “శుక్రుడు”. అధిష్టాన దేవత “ఆప”. ఇది క్రూరమైన మరియు భయంకరమైన స్వభావం గల నక్షత్రం.

పూర్వాషాఢ నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం శుక్రాయ నమః ||
  2. ఓం అద్రభ్యో నమః ||

పూర్వాషాఢ నక్షత్రం ఉన్నరోజు – పోరాటాలు, చెడు, మోసం, సంఘర్షణ, శత్రువుల నాశనము, నిర్బంధం, విష ప్రయోగం, నిప్పు పెట్టడం, విధ్వంసం, అపఖ్యాతి మరియు క్రూరత్వం వంటి చర్యలకు అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలకు అనుకూలం కాదు.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel