వచ్చే సంవత్సరం లాంచ్ కాబోయే KTM RC 490 బైక్ టెస్ట్ చేస్తూ యూరోప్ లో దొరికిపోయింది. నిజానికి ఈ బైక్, వచ్చే ఏడాది మధ్యలో ఇటలీలోని మిలన్ లో ఒక ఈవెంట్ లో తొలిసారి ప్రదర్శించాల్సి ఉంది. ఇండియాలో 2027 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న రెండు సిలిండర్లు కలిగిన ఈ 500cc బైక్ టెస్ట్ రైడ్ లో బైక్ ప్రియుల కంటపడిన ఇమేజ్ లు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీని ఫీచర్ల విషయానికి వస్తే, పారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ పవర్ కలిగిన 490cc ఇంజన్ తో వస్తోంది. ఇతర ఫీచర్స్ 50-55 PS టార్క్, 45-50 Nm ట్రాన్స్మిషన్ 6-స్పీడ్ మాన్యువల్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్.

దీని అత్యధిక వేగం గంటకు 200 కిమీ కాగా, లీటరు పెట్రోలుకు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారు. డ్యూయల్-ఛానల్ ABSతో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు సస్పెన్షన్ WP అపెక్స్ USD ఫోర్క్స్ (ముందు), WP అపెక్స్ మోనో-షాక్ (వెనుక) బ్లూటూత్‌తో TFT డిస్‌ప్లే, రైడింగ్ మోడ్‌లు, క్విక్‌షిఫ్టర్, కార్నరింగ్ ABS & ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు కలిగిన దీని అంచనా ధర మనదేశంలో ₹3.85 – ₹4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా!
600cc కన్నా తక్కువలో మంచి సామర్ధ్యం ఉన్న బైక్ కావాలనుకునేవారు, ఎప్రిలియా RS457 and కవసాకి నింజా 500 లకు దీటుగా రాబోతున్న KTM RC 490 ను తప్పక ఎంచుకోవచ్చు. భారత్ లో దీన్ని బజాజ్ ఆటో తయారు చేసే అవకాశం ఉంది.