Bigg Bosstrending

Bigg Boss Telugu 9: సామాన్యుల టాప్-15 కోసం అగ్నిపరీక్ష

తెలుగులో అత్యధికంగా ఆదరణ పొందే రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఆగస్టు 22 న మొదలైపోయింది. సామాన్యులను ఎంపిక చేసేందుకు “అగ్నిపరీక్ష” ఎపిసోడ్లతో ఇప్పటికే ఆదరణ పొందుతోంది. జియోహాట్‌స్టార్‌లో ఈ ప్రోగ్రామ్ రోజుకో ఎపిసోడ్ చొప్పున టెలికాస్ట్ అవుతుంది. హోస్ట్ గా శ్రీముఖి..జడ్జీలుగా పూర్వపు బిగ్ బాస్ విజేతలైన బిందు మాధవి, అభిజీత్, నవదీప్ లు 45 మంది సామాన్య ప్రజల నుంచి మొదటిగా టాప్-15లను ఎంపికచేసే పనిలో ఉన్నారు. మెగా ఆడిషన్ షో లో ఇప్పటికే 11 మంది టాప్-15లో చేరిపోయారు. మరో నాలుగు స్థానాల కోసం 11 మంది పోటీలో ఉన్నారు.

మొత్తానికి బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో 45 మంది సామాన్యులలో 15 మందిని సెలక్ట్‌ చేసి, వారిలో నుంచి 9 మందిని బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌కు పంపించనున్నారు. ఈసారి బిగ్‌బాస్‌ చాలా విభిన్నంగా సాగనుంది. బిగ్‌బాస్‌ వాయిస్ మారనుంది.. అలాగే ఈసారి రెండు హౌస్ లు ఉండనున్నాయి.

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్‌కు 15 మందిని సెలక్ట్‌ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌కు పంపించనున్నారు.

తెలుగు ఓటీటీలో నంబర్ వన్ – అగ్నిపరీక్ష

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో తెలుగులో అగ్నిపరీక్ష ఎపిసోడ్లు ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత వరుసగా హార్ట్ బీట్ సిరీస్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కూకు విత్ జాతి రత్నాలు, బిగ్ బాస్ 8 టాప్-5లో ఉన్నాయి.